కబ్జాలను కట్టడి చెయ్యలేని కలెక్టర్లు!!!

 

  •  ప్రజల విశ్వాసం కోల్పోతున్న జిల్లా కలెక్టర్లు!
  •  ఫిర్యాదు చెత్తబుట్టలో మాత్రమే పరిమితమా?
  •  సమస్యలు పరిష్కరించలేని అసమర్థత అధికారులు ఎందుకు?
  • లంచాల రుచి మరిగిన అధికారులకు ఉద్యోగ బాధ్యత విలువ తెలియదు!
  • ప్రథమ పౌరురాలు/పౌరుడు కె దిక్కు, దివాణం లేని పరిస్థితి! 
  • ఫోర్జరీ సంతకాలంటే పట్టించుకునే నాథుడే లేడు!
  •  గ్రామ పంచాయతీ తీర్మానాన్ని తుంగలో తొక్కిన అధికారులు                                                  సంగారెడ్డి జిల్లా, కంది మండలం, బేగంపేట గ్రామం పరిధిలో ప్రభుత్వ స్థలాలు విచ్చలవిడిగా, బహిరంగంగా కబ్జాలు జరుగుతున్నా కట్టడి చెయ్యడంలో నాటి నుండి నేటి వరకు పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బేగంపేట గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమి స్థలమును కబ్జా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడడం గురించి ఫిర్యాదు చేశారు. విషయం సమాచారం తెలుకొనేందుకు 'రుద్ర రిపోర్టర్ ప్రయత్నించగా... సంగారెడ్డి జిల్లా కలెక్టర్ల పట్ల ఆ గ్రామా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకే సమస్య కొరకు పలు మార్లు బాధ్యతగల సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులకు పిర్యాదులు చేసినప్పటికీ పరిష్కారం లభించకపోవడం అంటే వాటికీ సంబదించిన  'ఫిర్యాదులు చెత్తబుట్టలో మగ్గుతున్నాయని ఎందుకు అనుకోకూడదు..? బాధ్యతగల ఉద్యోగులే జవాబు చెప్పాలని గ్రమాస్తులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించలేని అసమర్థత అధికారులు ఎందుకు? అంటూ ఘాటుగానే వారి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. లంచాల రుచి మరిగిన అధికారులకు ఉద్యోగ బాధ్యత విలువ తెలియడం లేదుకాబట్టే ఇలాంటి పరిస్థితులు మరి మరి వెలుగులోకి వస్తున్నాయని గ్రామస్తులు అసహనం వెలిబుచ్చారు. గ్రామా ప్రథమ పౌరురాలు/పౌరుడు అయినా వారికే దిక్కు, దివాణం లేని పరిస్థితి దాపురిస్తున్నాయంటే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో వున్నదో జిల్లా కలెక్టర్ ఒకటికి రెండు సార్లు సమీక్షించు కోవాలని ఆ గ్రామా ప్రజలు ప్రస్తుత జిల్లా కలెక్టర్ కు హితువు పలికారు. గ్రామా కార్యదర్శి యొక్క ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్ సృష్టించి ప్రభుత్వ స్థలమును కబ్జా చేసి ఇంటి నిర్మాణం కొనసాగుతున్న పట్టించుకునే నాథుడే లేదంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేసారు. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అధికారులుతుంగలో తొక్కిన మాట నిజం కాదా? అంటూ ప్రజలు సూటిగా ప్రశ్నలను సందించారు. ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంటు సృష్టించి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడడానికి ప్రభుత్వ వుద్యోగులకు చేతకాని తనం, అసమర్థత ఏమిటి? అంటూ ఆ గ్రామా ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సమస్యను తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటూ.. 'గ్రామాల అభివృద్దే దేశానికి పట్టుకొమ్మలు' అనే సూక్తి ని ప్రభుత్వ ఉద్యోగులు మరిచిపోకుండా బాధ్యతతో నడుచుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆ గ్రామా ప్రజలు హితువు పలికారు.


Post a Comment

0 Comments